Wednesday, February 8, 2017

చీకటిలో కారు చీకటిలో




చిత్రం :  మనుషులు మారాలి (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  శ్రీ శ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :


చీకటిలో కారు చీకటిలో... కాలమనే కడలిలో
శోకమనే పడవలో... ఏ దరికో.. ఏ దెసకో


చీకటిలో కారు చీకటిలో... కాలమనే కడలిలో
శోకమనే పడవలో... ఏ దరికో.. ఏ దెసకో



చరణం 1 :


మనసున పెంచిన మమతలు పోయే
మమతలు పంచిన మనిషే పోయే


మనసున పెంచిన మమతలు పోయే
మమతలు పంచిన మనిషే పోయే



మనిషేలేని మౌనములోనా
మనుగడ చీకటి మయమైపోయే
లేరెవరూ... నీకెవరూ


చీకటిలో కారు చీకటిలో... కాలమనే కడలిలో
శోకమనే పడవలో... ఏ దరికో.. ఏ దెసకో



చరణం 2 :


జాలరి వలలో చేపావు నీవే
గానుగ మరలో చేరుకువు నీవే


జాలరి వలలో చేపావు నీవే
గానుగ మరలో చేరుకువు నీవే


జాలే లేని లోకంలోన
దారిలేని మనిషివి నీవే
లేరెవరూ.. నీకెవరూ..



చీకటిలో కారు చీకటిలో... కాలమనే కడలిలో
శోకమనే పడవలో... ఏ దరికో.. ఏ దెసకో





No comments:

Post a Comment