Thursday, March 30, 2017

హుషారు కావాలంటే

చిత్రం : గంగ - మంగ (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : బాలు 


పల్లవి :



హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా 


హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే... మందురా  


చరణం 1 :



అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ... ఏది?....  మందొక్కటే మందురా       



చరణం 2 :



జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా 


నిన్నా రేపని తన్నుకోకురా...  ఉన్నది నేడే మరువబోకురా
అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే....  మందురా 




చరణం 3 :



ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..తోకాడించే నీవే తోడురా  

  

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా


హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3062

No comments:

Post a Comment