Monday, March 20, 2017

వెండి చందమామలు

చిత్రం : బావామరదళ్లు (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు 



పల్లవి :


వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు ఎవరి కోసము?
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము 


వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు 


ఎండపూల జల్లులు ఎవరి కోసము?
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము  



చరణం 1 :



ఘడియలైన  కాలమంతా ఘడియైనా వీడలేని
ఘాఢమైన మమతలు పండే కౌగిలి కోసం 


మధువులైన మాటలన్నీ పెదవులైన ప్రేమలోనే
తీపి తీపి ముద్దులు కొసరే వలపుల కోసం


నవ్వే నక్షత్రాలు... రవ్వల చాందినీలు
పండినవే కలలు... అవి పరచిన పానుపులు


నీవు లేక నాకు రాని నిర కోసము...
నిన్ను తప్ప చూడలేని కలల కోసము


వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
అ... అహహ.. ఏహే.. ఆ... ఆ.. ఆ.. 




చరణం 2 :



తనువులైన బంధమంతా క్షణమైనా వీడలేని
అందమైన ఆశలు పూసే ఆమని కోసం


పల్లవించు పాటలన్నీ వెలుగులైన నీడలలోనే
తోడు నేను ఉన్నానన్నా మమతల కోసం


వెన్నెల కార్తీకాలు... వెచ్చని ఏకాంతాలు
పిలిచే కోయిలలు... అవి కొసరే కోరికలు


నిన్ను తప్ప కోరుకోని మనసు కోసము...
నీవు నేను వేరు కాని మనువు కోసము



వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
వెండి చందమామలు... వేయి తీపి రాత్రులు
ఎండపూల జల్లులు ఎవరి కోసము
ఒకరి కోసం ఒకరున్న జంట కోసము
బంధమైన అందమైన బ్రతుకు కోసము 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2688

2 comments:

  1. మనందరం ఎరిగినట్లు, ‘ఆమని’ కి మరో అర్థం ‘వసంత ఋతువు’. ఈ ఋతువు, చెట్లు చిగుర్చి పూలు పూచే కాలము.

    సంధర్భానుసారం, ఈ పాటయందు “అందమైన ఆశలు పూసే ఆవని కోసం” అన్న వాక్యంలో అది “......ఆమని కోసం” అని నాకు అనిపిస్తోంది. అదే విధంగా, తరువాతి వాక్యంలో కవి ‘పిలిచే కోయిలలు, అవి కొసరే కోరికలు’ అని అన్నారు, కోయిల పిలుపు కూడా వసంత కాలాన్ని సూచిస్తోంది అని నాకు అనిపిస్తోంది.

    సరిచూడగలరు, అన్యదా భావించరని తలుస్తాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీకు. ఎంతో సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ ఇలా తప్పులు పట్టలేరు. ఇలా పాటలలో తప్పులు సరి చేసుకునేందుకు మీరు చాలా సహకరిస్తున్నారు. మరోమారు ధన్యవాదాలు మీకు.

      Delete