Thursday, March 30, 2017

యవ్వనమే ఎదురై నిలిచింది

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది

మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మందారమకరందమై... అందమై... అందమై...

యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై

చరణం 1 :

అందీ అందని రుచితో నీ అందం కవ్విస్తుంటే...
చక్కిలిగింతల చలికే ఆ చుక్కలు దిగి వస్తుంటే

చూసీ చూడని కలలే నీ చూపులు లాగేస్తోంటే
ముద్దులు ముచ్చట పడుతూ నీ ముద్దర వేసేస్తోంటే
చలిమంట కాగాలి చెలి జంటలో... జంటలో.. జంటలో

యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది

చరణం 2 :

కౌగిలి చాలని వలపే ఏకాంతం కోరుతూ ఉంటే
గాలికి తెలియని కబురే చెలి కన్నులు పంపుతు ఉంటే 

మాపటి వేళకు సిగలో విరులే మరులౌతుంటే
వెచ్చని ఆ ఊపిరులే నా వయసుకు గురి పెడుతుంటే
అందాల తొలి పూజ అందాలిలే... అందాలిలే... అందాలిలే

యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై

యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2660

No comments:

Post a Comment