Thursday, June 8, 2017

చిలకపచ్చని చీరలోనా

చిత్రం : జీవిత నౌక (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి : 


చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
చిట్టమ్మి... నీ మీద ఒట్టమ్మి...హహహహహహ 



చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... హహహహహహహా


చిలకపచ్చని చీరలోనా....



చరణం 1 :



సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
నా పెదవులు నిన్నడిగితే... ముడుపుగా ఇచ్చుకో



ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చిన ఆ వేళలో... ఎన్నెన్ని తీపి మెరుపులో


చిలకపచ్చని చీరలోనా చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... లరలరలరలరలర 


చిలకపచ్చని చీరలోనా....



చరణం 2 :


చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
చల్లని నీ రూపమే...  నా కళ్ళలోనీ కాటుకా
పచ్చని నా పరువమే...  నీ దోసిట కానుక


నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
నీ కాటుక కన్నులే...  నా కలలకు పొదరిల్లు
వేసేను ఆ కలలే...  విడిపోని మూడుముళ్ళు



చిలకపచ్చని చీరలోనా...  చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
ఎందుకని... ఓరబ్బి ఎవరికని...
ఇందుకని... చిట్టమ్మి ఇందుకేనని  






No comments:

Post a Comment