Saturday, July 1, 2017

ఎవరికి తెలియదులే

చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల 



పల్లవి : 



అహహా.. ఓహోహో.. అహహహా.. ఓ..ఓ..ఓ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఎవరికి తెలియదులే... యువకుల సంగతి


ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
యువకుల సంగతి... మీ తలబిరుసుల సంగతి


ఎవరికి తెలియదులే... యువకుల సంగతి



చరణం 1 :


ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఆడపిల్ల కనబడితే ఏడిపించబోతారు
ఏడిపించి మేను మరచి ఎగిరి నవ్వుకుంటరు
నవ్వి నవ్వి చివరకు నవ్వులపాలౌతారు




ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి



చరణం 2 :


లేనిపోని డాబులతో.. లెక్కలేని కోతలతో...
లేనిపోని డాబులతో.. లెక్కలేని కోతలతో...
గడుసుగడుసు మాటలతో.. మిడిసిపాటు చేతలతో...

కాలరెత్తి తిరుగుతారు... కాళ్ళబేరమాడతారు


హ...ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి



చరణం 3 :



ముందు తీగలేకుంటే... పందిరితో పని ఉందా?
ముందు తీగలేకుంటే... పందిరితో పని ఉందా?
పునాదులే లేకుంటే... భువిని గోడ ఉంటుందా?
ఆ.. పునాదులే లేకుంటే... భువిని గోడ ఉంటుందా?


తరుణులసలు లేకుంటే... పురుషుల పని గోవిందా...
తరుణులసలు లేకుంటే... పురుషుల పని గోవిందా...
గోవిందా... గోవిందా... హహ


ఎవరికి తెలియదులే... యువకుల సంగతి
యువకుల సంగతి... మీ తలబిరుసుల సంగతి
ఎవరికి తెలియదులే... యువకుల సంగతి




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=92

No comments:

Post a Comment