Wednesday, July 19, 2017

కైలాస శిఖరాన కొలువైన స్వామి

చిత్రం :  మహారాజు ( 1985 )
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల



పల్లవి :



కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లె మారాజులు
మమతంటు లేనోల్లె నిరుపేదలు


ప్రేమే నీ రూపం....  త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే


రాజువయ్యా...  మహరాజువయ్యా
రాజువయ్యా...  మహరాజువయ్యా



చరణం 1 :



కన్నీట తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమ కన్నా నిధులు లేవు
నీకన్న ఎవరయ్యా మారాజులు
నిన్నెవరు ఏమన్నా నీ దాసులు


జరిగినవి జరిగేవి కలలే అనుకో
జరిగినవి జరిగేవి కలలే అనుకో



రాజువయ్యా మహరాజువయ్యా
రాజువయ్యా మహరాజువయ్యా





చరణం 2 :



త్యాగాల జీవితం తనవారికంకితం
మిగిలింది నీ నేను..  నా నువ్వేలే
దేవుండంటి భర్త వుంటే....
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్నా బంధాలే మాగాణులు


ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు



రాజువయ్యా మహరాజువయ్యారాజువయ్యా మహరాజువయ్యా 


కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లె మారాజులు
మమతంటు లేనోల్లె నిరుపేదలు


ప్రేమే నీ రూపం....  త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే


రాజువయ్యా...  మహరాజువయ్యా
రాజువయ్యా...  మహరాజువయ్యా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2114

No comments:

Post a Comment