Wednesday, July 19, 2017

చిరునవ్విస్తా శ్రీవారికి

చిత్రం :  మహారాజు ( 1985 )
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


చిరునవ్విస్తా శ్రీవారికి.. ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
మల్లెల కన్నా తెల్లనిది కల్లాకపటం తెలియనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా ... 



సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మణులేమివ్వను మా లక్ష్మికి... ఆహహ.. హా
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మా రాణేవారంటా


చరణం 1 :



వెన్నెల కాసేనమ్మా నీరెండలు....  వెనకే తిరిగేనమ్మ మా ఆశలు
లేమిలో మా ప్రేమనే ఒక దీపం వెలిగించి మాకోసం 


వెలుగుకి వెలుగే ప్రేమ...  కంటికి కన్నె ప్రేమా
కన్నుల నిండా ప్రేమ...  కౌగిలి పండే ప్రేమా
ఆ ప్రేమే పెన్నిధిగా జతకలిసింది జంటా


సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా





చరణం 2 :





కోయిల కోరిందంటా నీ పాటలు...  నెమలికి నేర్పాలంటా సయ్యాటలు
జీవనం బృందావనం ఈలాగే మిగిలిందీ నాకోసం

 
పెదవికి పెదవే ప్రేమా... మనసుకి మనసే ప్రేమా
ఒకరికి ఒకరు ప్రేమా.. ఒడిలో ఒదిగే ప్రేమా
ఆ ప్రేమ ఊపిరిలో కడ తేరాలీ జంటా



చిరునవ్విస్తా శ్రీవారికి.. ఆహహ.. హా
మరుముద్దిస్తా మావారికి.. ఓహొ.. ఓహో
మల్లెల కన్నా తెల్లనిది కల్లాకపటం తెలియనిది
మనసుంటే మమతుంటే మారాజేవరంటా ... 



సిరులేమివ్వను శ్రీలక్ష్మికి... ఆహహ.. హా
మణులేమివ్వను మా లక్ష్మికి... ఆహహ.. హా
జాజులకన్నా తెల్లనిది జాబిలికన్నా చల్లనిది
మనసుంటే మమతుంటే మా రాణేవారంటా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2694



No comments:

Post a Comment