Thursday, August 10, 2017

ఎగరాలి జాతీయ పతాకం

చిత్రం :  మోసగాడు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం :  బాలు, 
ఎం.రమేష్





పల్లవి : 



ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి


గగనం ఉన్నాళ్లదాకా...  కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి




చరణం 1 :



జాతి నిదుర లేచిన సమయం... జనానికిది పండుగ ఉదయం
అదిగో మన తపస్సు ఫలితం... అదే అదే మన స్వాతంత్య్రం


తరతరాల చీకటి ఇళ్ళే... కటకటాల కౌగిట గూళ్ళే
బానిసలకు వారసులం... బ్రతికి ఉన్న పీనుగులం
ఎక్కడుంది స్వాతంత్య్రం... మాకేదీ ఆ స్వాతంత్య్రం


ఓ... మహామహుల త్యాగఫలం... మరిచిపోకు స్వాతంత్య్రం
యుగయుగాల పోరాటంలోఉదయించిన అమృతభాండం
స్వాతంత్య్రమే నీ జన్మహక్కని తెలుసుకో
అది అందుకునే అర్హత నీలో పెంచుకో


ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
గగనం ఉన్నాళ్లదాకా కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి




చరణం 2 :



ఇదిగిదిగో నా దేశంలో... వెలిగిన శతకోటి ఉషస్సులు
అదిగదిగో ఆకాశంలో... మువ్వన్నెల ఇంద్రధనుస్సులు


జైలన్నది భూతల నరకం
ఇది సజీవ శవాల దహనం జరిగే మహా శ్మశానం
ఎక్కడుంది స్వరాజ్యం.... రాబందుల రావణ రాజ్యం


ఓ... ఇది జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు జన్మించిన చోటు
రామదాసు మొరలే విని చరలే... శ్రీరాముడు విడిపించిన చోటు
ఇదే జాతిపిత బాపూజీ... స్వరాజ్యాన్నిసాధించిన చోటు
ఈ దేశం సందేశం నెహ్రూజీ వినిపించిన చోటు


స్వాతంత్య్రమే నీ జన్మహక్కని తెలుసుకో
అది అందుకునే అర్హత నీలో పెంచుకో


ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
గగనం ఉన్నాళ్లదాకా కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి





No comments:

Post a Comment