Monday, October 2, 2017

అంతులేని అనురాగం

చిత్రం  :  పండంటి జీవితం (1981)
సంగీతం  :   చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు




పల్లవి : 


అంతులేని అనురాగం అన్నగా.. చెల్లిపోని మమకారం చెల్లిగా
అంతులేని అనురాగం అన్నగా.. చెల్లిపోని మమకారం చెల్లిగా
జీవించు వెయ్యేళ్ళు చల్లగా.. దీవించనీ నిన్ను అమ్మగా నాన్నగా
వెరసి నీ అన్నగా..


అంతులేని అనురాగం అన్నగా.. చెల్లిపోని మమకారం చెల్లిగా


చరణం 1 :



ఒకే కొమ్మ పువ్వులం... ఒకే అమ్మ దివ్వెలం
ఒకే కొమ్మ పువ్వులం... ఒకే అమ్మ దివ్వెలం


తొడిమలేని తోటలో.. ప్రమిద లేని గూటిలో
కలిసిమెలిసి నవ్విన.. కమ్మని చిరునవ్వులం


అన్న అనే నేను రేపు నిన్న లో కలిసినా
అన్న అనే నేను రేపు నిన్న లో కలిసినా
చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళూ పచ్చగా...
నూరేళ్ళూ పచ్చగా... 


అంతులేని అనురాగం అన్నగా...
చెల్లిపోని మమకారం చెల్లిగా 



చరణం 2 :


పుట్టినింట ప్రేమతో... మెట్టినింట పేరుతో
పుట్టినింట ప్రేమతో... మెట్టినింట పేరుతో


కాలు పెడితే కలిమిగా... కంటి చూపు చెలిమిగా
మహలక్ష్మికి మారుగా... మమతల బంగారుగా


కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా
కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా


అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్షుగా...
నీకు చిరాయుష్షుగా


అంతులేని అనురాగం అన్నగా... చెల్లిపోని మమకారం చెల్లిగా
జీవించు వెయ్యేళ్ళు చల్లగా... దీవించనీ నిన్ను అమ్మగా నాన్నగా
వెరసి నీ అన్నగా..
వెరసి నీ అన్నగా..  





No comments:

Post a Comment