Tuesday, October 31, 2017

ప్రియతమ లలనా

చిత్రం :   శ్రావణ సంధ్య (1986)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 




పల్లవి :


ప్రియతమ లలనా...  ఆఆ...... ఆఆ..

గోరింటాకు పొద్దుల్లోనా...  తాంబూలాలా ముద్దిస్తావా 

కొసరీ...  కొసరీ.. 

సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో...



ప్రియతమ వదనా...  ఆఆ..... ఆఅ..

తాంబూలాలా ముద్దే ఇస్తే...  పరువాలన్నీ పండిస్తావా 

వలచీ.. పిలచీ 

కవ్వించేటీ కన్నే కొట్టీ కౌగిళ్ళతో..




చరణం 1 : 



సంపంగీ పువ్వుల గిన్నెలలోనా...
పచ్చని సాయంత్రమే దాగిపోయే..
పున్నాగా పువ్వుల దోసిలిలోనా... 
గాలికి గంధాలు చెలరేగిపోయే.. 



సొగసుల రుచులే చూడాలంటా
వయసుకు పరువం రావాలంటా
కలలే...  నిజమై.. కలలే నిజమై
సిగ్గే పుట్టీ చిరునవయ్యే రసలీలలో..ఓఓ..



ప్రియతమ వదనా.. ఆఆ.... ఆఆ
తాంబూలాలా ముద్దే ఇస్తే... పరువాలన్నీ పండిస్తావా
కొసరీ.....  కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో 



చరణం 2 :



వేసంగీ వేడి ఊపిరి సోకీ.... 
పెదవులలో తేనెలే కాగిపోయే
పలకల్లో అందాలెన్నొ పెరిగి.... 
తీరని దాహాలు సుడి రేగిపోయే.. 


పొదలో దీపం వెలగాలంటా
ఎదలో వెన్నెల చిలకాలంటా
మనలో...  మనమై...  మనలో మనమై
కాలం లోకం అన్నీ మరిచే బంధాలలో



ప్రియతమ లలనా.. ఆఆ.... ఆఆ..
గోరింటాకు పొద్దుల్లోనా...  తాంబూలాలా ముద్దిస్తావా
కొసరీ....  కొసరీ..
సన్నాయంటీ నడుమే ఇచ్చి సందేళలో



ప్రియతమ వదనా.. ఆఆ.... ఆఆ..
తాంబూలాలా ముద్దే ఇస్తే... పరువాలన్నీ పండిస్తావా
వలచీ....  పిలచీ
కవ్వించేటీ కన్నే కొట్టీ కౌగిళ్ళతో..
ఓఓ.. ఓఓ.. ఓఓ.. ఓఓ.. ఓఓ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6505



No comments:

Post a Comment