Friday, November 3, 2017

పరవళ్ళు తీసింది గోదావరి

 చిత్రం  :  ఊరికి సోగ్గాడు  (1985)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  బాలు,  జానకి




పల్లవి : 



ఆ.. ఆ.. ఆ.. అ... ఆ.. ఆ..
ఓ..ఓహొ.. ఓ... ఓ..


పరవళ్ళు తీసింది గోదావరి...  పాడింది నా మనసు గీతావళి
పరవళ్ళు తీసింది గోదావరి...  పాడింది నా మనసు గీతావళి


వెతలేని హృదయాలలో... వెలిగింది అనురాగ దీపావళి


ఓ.. ఓ.. ఓ.. ఓ.. అహహా.. ఆ.. ఆ...




చరణం 1 :


నీ కళ్ళలో నన్ను నివశించనీ.. 

ఆకాశతీరల విహరించని


తేలే మబ్బులన్నీ మల్లెపూలై రాలని...
ఓ.. ఓ.. వీచే ఆశలన్నీ అందలాలై సాగని
కలకాలం వలపే వరమై స్వరమై నిలువనీ... 


పరవళ్ళు తీసింది గోదావరి.. పాడింది నా మనసు గీతావళి
వెతలేని హృదయాలలో... హొ.. ఓ.. వెలిగింది అనురాగ దీపావళి



చరణం 2 : 



మెరిసింది నీ సిగ్గు సిందూరమై...
దొరికింది నీ ప్రేమ మణిహారమై... 



నిన్నే చూడగానే మేని తానై ఊయలా...
హ.. ఆ.. నీవే పాడగానే కొమ్మ తానై కోయిలా
నీవేలే గానం ధ్యానం ప్రాణం... ప్రియతమా..



పరవళ్ళు తీసింది గోదావరి.. పాడింది నా మనసు గీతావళి
వెతలేని హృదయాలలో... ఓ.. వెలిగింది అనురాగ దీపావళి
ఓ.. ఓ.. ఓ.. ఓ.. అహహా.. ఆ.. ఆ...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2702

No comments:

Post a Comment