Wednesday, November 1, 2017

గాలి వానలో వాన నీటిలో

చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : ఏసుదాస్ 


పల్లవి :



గాలి వానలో...  వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం ... తెలియదు పాపం



గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ.... ఒఒఒ



చరణం 1 :



ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

హొరు గాలిలో వరద పొంగులో... సాగలేలని తెలుసు


అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

జోరు వానలో నీటి సుడులలో... మునక తప్పదని తెలుసు



అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో




చరణం 2 :



ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఆశ జారినా వెలుగు తొలిగినా... ఆగదు జీవిత పొరాటం


ఇది మనిషి మనసుల పోరాటం

అది ప్రేమ పెళ్ళి చెలగాటం

ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై... బ్రతుకుతున్నదొక శవం


అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం


గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2109

1 comment:

  1. wrong lyrics loaded.. if you want to correct them.. here they are

    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ..
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ..
    వీచే గాలుల తాకిడీ..సాగే గువ్వల అలజడీ..
    రారమ్మని పిలిచే పైబడీ.. ||ఆకాశం ఎందుకో||

    పసుపుపచ్చ లోగిలిలో పసుముకొమ్ము కొట్టినట్టు
    నీలిరంగు వాకిలిలో పసుబార బోసినట్టు
    పాదాల పారాణి అద్దినట్టూ..
    నుదుటిపై కుంకుమా దిద్దినట్టూ..||ఆకాశం ఎందుకో||


    పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
    విరబోసిన తలనిండా కనకాంబరమెట్టినట్టు
    ఎర్రనీళ్ళూ దిష్థి తీసి పోసినట్టూ..
    కర్పూరం హారతీ ఇచ్చినట్టూ..||ఆకాశం ఎందుకో||

    ReplyDelete