Friday, December 1, 2017

వలపు ఏమిటి ఏమిటి ఏమిటి

చిత్రం  :  బంగారు గాజులు (1968)
సంగీతం  :  టి. చలపతిరావు
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం  :  సుశీల



పల్లవి :



వలపు ఏమిటి...  ఏమిటి... ఏమిటి?
వలపు తొందర చేయుట ఏమిటి?
మనసు ఊయల ఊగుట ఏమిటి?
ఎచట దాగేను రాగల పెనిమిటి?


వలపు ఏమిటి... ఏమిటి... ఏమిటి?
వలపు తొందర చేయుట ఏమిటి?
మనసు ఊయల ఊగుట ఏమిటి?
ఎచట దాగేను రాగల పెనిమిటి? 



చరణం 1 :



అల్లరివాడో... చల్లని రాజో     

లేత అందాలు దోచేటి మగరాయుడో  

లలలాలలలాలలలాలలా..

కన్నులు మూసీ... కపటాలు చేసి

నన్ను కవ్వించి... కరగించు సుకుమారుడో..

ఎవ్వరో... ఎవ్వరో

నవ్వుతూ నవ్వించుతూ... ఏల రాడే...  వాడే నేడే


వలపు ఏమిటి..  ఏమిటి.. ఏమిటి?

వలపు తొందర చేయుట ఏమిటి?

మనసు ఊయల ఊగుట ఏమిటి ?

ఎచట దాగేను రాగల పెనిమిటి? 




చరణం 2 :



మగసిరి చూసి... మనసే నిలిపి

కన్నెమదిలోన నునుసిగ్గు లాలించునో

లలలాలలలాలలలాలలా..

పొంకములన్ని పోంగేవేళ..

కోటి మురిపాల కెరటాల తేలించునో..

చిలిపిగా... చెలిమిగా ... చనువుగా..తనివిగా 

చేర రాడే....  వాడే నేడే 



వలపు ఏమిటి..  ఏమిటి.. ఏమిటి?

వలపు తొందర చేయుట ఏమిటి?

మనసు ఊయల ఊగుట ఏమిటి ?

ఎచట దాగేను రాగల పెనిమిటి? 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1194

No comments:

Post a Comment