Tuesday, December 5, 2017

ఈ ఎన్నెల ఎలుగుల్లోన

 చిత్రం :  బ్రహ్మచారి (1967)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఈ ఎన్నెల ఎలుగుల్లోన...  ఎంకి నిన్ను ఎతుకుతువుంటే
ఏ చల్లని గాలి నిన్ను... ఎత్తుకు పోయింది బావా?
ఓ... నాయుడు బావా



చరణం 1 :


పైటగాలి ఇసురుల్లోనే.. పడిపోయా మైకంతోనే
నీ ఎంటే నీడగసాగి... నీ ఎదలో ఒదిగున్నానే
నీ ఎంటే నీడగసాగి... నీ ఎదలో ఒదిగున్నానే
నీ నవ్వుల ఎన్నెల్లోనే... మేడలు కట్టేనే ఎంకి..ఈ
నా చక్కని ఎంకి


ఈ ఎన్నెల ఎలుగుల్లోన.. ఎంకి నిన్ను ఎతుకుతువుంటే
ఏ చల్లని గాలి నిన్ను... ఎత్తుకు పోయింది బావా
ఓ...నాయుడు బావా




చరణం 2 :


మదనా రావోయీ ఒక్కసారి
ఎవ్వరూ లేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట
ఎవ్వరూ లేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట
నను కవ్వించే రతి రాజా.. నీ చెలిపైనే దయరాదా
ఎవ్వరూలేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట


విరజాజులకే పరిమళ మొసగే... నీ ముంగురులే ముద్దిడుకోనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరజాజులకే పరిమళ మొసగే... నీ ముంగురులే..ముద్దిడుకోనా
స్వర్గమునైనా వలదనిపించే..  నీ కౌగిలిలో సోలిపోనా
ఎవ్వరూలేని ఈ చోట ఇటు.. రా రా రా.. ఒక మాట




చరణం 3 :



ఇరువుర మొకటై మురిసేవేళ... పూవుల వానలే కురియునులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇరువుర మొకటై..మురిసేవేళ... పూవుల వానలే..కురియునులే
తీయని వలపుల వూయలలోన... జగమంతా మై మరచునులే


ఎవ్వరూలేని ఈ చోట ఇటు..రా రా రా.. ఒక మాట
ఎవ్వరూలేని .. ఈ.. చోట





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1637

No comments:

Post a Comment