Tuesday, December 5, 2017

సిత్తరాల తోటలో

చిత్రం :  బుచ్చి బాబు (1980)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి...
నువ్వు రాశావా... నేను రాశానా
నాకు నువ్వు రాశావా... నీకు నేను రాశానా



సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో చిత్తరాలు జరిగాయి...
నువ్వు చూశావా... నేను చూశానా
అవి నువ్వు చూశావా... అవి నేను చూశానా



చరణం 1 :




కలలో ఎవరో కనిపిసే... ఏదో ఏదో చెప్పేస్తే
కాగితమేదని వెతికాను... కాటుక కన్నుతో రాశాను


ఆ.. కన్నుల కాటుక కవితై వ్రాయగా
వెన్నెల కోయిలా...  తీపిగ పాడగా
చెట్టులన్ని ఆడాయి... కొమ్మలన్ని ఊగాయి
ఆకు ఆకు గుసగుసలాడి... ఉత్తరాలు రాశాయి...


చరణం 2 :



చీకటి మాటున నడిచొచ్చి... వాకిట చాటున నిలబడితే.. అహా
ఎవరా ఎవరని చూశాను... గుండెల గుడిలో దాచాను


హే.. దాచిన దుడుకులు దాడులు చేయగా
చేసిన దాడులు...  గుండెలు చీల్చగా
చెట్టులన్ని ఊగాయి ... కొమ్మలన్ని ఆడాయి
ఆకు ఆకు గుసగుసలాడి... సిత్తరాలు చేశాయి
సిత్తరాలు చేశాయి



సిత్తరాల తోటలో... ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. హోయ్..
సిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి...
నువ్వు రాశావా... నేను రాశానా
నాకు నువ్వు రాశావా... నీకు నేను రాశానా








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1854

No comments:

Post a Comment