Tuesday, December 19, 2017

ఓలోలే నీ సోకు

చిత్రం :  ముద్దుల కొడుకు (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 




పల్లవి :



ఓలోలే నీ సోకు... లేలేత తమలపాకు... తాంబూలమివ్వమంటా
నా సూపే సున్నమేసి... నీ వలపే వక్క చేసి
చిలక చుట్టి ఇస్తుంటే... నీ చిటికనేలు కొరుకుతుంటా
ఆహుం..ఆహుం..ఆహుం..



ఓలేలే నా సోకు... ఈ లేత తమలపాకు... తాంబూల మిచ్చుకొంటా
అందాలే విందు చేసి..మురిపాలే ముద్దు చేసి...  చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా... ఆహుం..ఆహుం..ఆహుం




చరణం 1 :



ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది
ఆ సున్నమెక్కువైనా... ఈ వక్క తక్కువైనా
నీ నోరు పొక్కుతుంది... నా జోరు ఎక్కుతుంది


మక్కువెక్కువైనప్పుడు పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో... చక్కెర పులుపెక్కదు..ఆహా
మక్కువెక్కువైనప్పుడు... పొక్కదూ..
పొక్కినా పెదవుల్లో...  చక్కెర పులుపెక్కదు..
ఆహుం..ఆహుం..ఆహుం... ఆహుం


అరెరెరె..ఓలోలె నీ సోకు..లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా



చరణం 2 : 



ముట్టుకొంటే ముదురుతుంది... పట్టుకొంటే పండుతుంది
కట్టుకుంటే కుదురుతుంది... కట్టుకో... కట్టుకో... కట్టుకో
ముడుపు... కట్టుకో... కట్టుకో... కట్టుకో


ముద్దు ముదిరిపోతుంటే... పొద్దు నిదరపోకుంటే
హద్దు చెదరిపోతుంటే... కట్టుకో... కట్టుకో... కట్టుకో
ముడుపు..కట్టుకో... కట్టుకో... కట్టుకో... వాయబ్బో..ఓ 


ఓలేలే నా సోకు... ఈ లేత తమలపాకు... తాంబూల మిచ్చుకొంటా... ఆఆఆ



చరణం 3 : 



నీ కుర్రకారు జోరు... నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా... పొలిమెర దాటకంటా
నీ కుర్రకారు జోరు... నా గుండెలోన హోరు
మితిమీరిపోతే తంటా... పొలిమెర దాటకంటా


పగ్గమేసి పట్టబోతె తగ్గదు... తగ్గినా
పడుచు ఊపు పట్టుకుంటే... చిక్కదు..ఓహా
పగ్గమేసి పట్టబోతె తగ్గదు... తగ్గినా
పడుచు ఊపు పట్టుకుంటే... చిక్కదు
ఆహుం..ఆహుం..ఆహుం..


ఓలోలే నీ సోకు... లేలేత తమలపాకు..తాంబూలమివ్వమంటా
అందాలే విందు చేసి... మురిపాలే ముద్దు చేసి చిలకచుట్టి ఇస్తుంటే
ఈ చిలిపి కొట్టూడెందుకంటా..
ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం..ఆహుం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1784

No comments:

Post a Comment