Tuesday, January 2, 2018

Hip Hip Hurray

చిత్రం :  భలే రంగడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల 

పల్లవి :

Hip Hip Hurray... ఓహో భలే
Hip Hip Hurray... ఒహో భలే

చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు
చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు

గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు
గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు
Hip Hip Hurray... ఒహో భలే  

చరణం 1 :

స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా
ఓ...ఓ... మ్మ్....మ్మ్...
ఓ...ఓ.....ఓ.....ఓ...ఓ.....ఓ
స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా

తీయని చల్లని లేత మనసు నీ స్నేహం వలన కమ్మనా...
నా తీయని చల్లని లేతమనసు నీ స్నేహం వలన కమ్మన

Hip Hip Hurray... ఒహో భలే

చరణం 2 :

నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు
నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు

నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు
ప్రతినవ్వు కురిసెను తేనెలు

Hip Hip Hurray... ఒహో భలే

చరణం 3 :

పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ
ఓ...ఓ...మ్మ్...మ్మ్...
ఓ....ఓ......ఓ....ఓ......
పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ

పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము
పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము

Hip Hip Hurray... ఒహో బలే
చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు
Hip Hip Hurray... ఒహో భలే
Hip Hip Hurray... ఒహో భలే
Hip Hip Hurray... ఒహో భలే 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1726

No comments:

Post a Comment