Thursday, August 9, 2018

మల్లెలు పూచే చల్లనివేళ

చిత్రం :  సూర్యచంద్రులు (1977)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  సినారె
నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా



చరణం 1 :



ఎన్నెన్ని ఆశలు ఎదలోన ముడిచీ... ఇన్నాళ్ళు ఆ రాధ వేచిందీ
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తనువెల్లా యమునా తరంగమై పొంగింది.... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా



చరణం 2 :



హృదయాల అలజడి నయనాలు తెలుపగ
అధరాలు పొందేను గిలిగింతలు
కరములు కలిసే...  సుమ శరములు కురిసే
మరులు తొందరించే...  సిగ విరులు పరవశించే
తెరలుగా దొంతరలుగా స్పందించుపోవు ఆ రాసకేళిలో... ఆ..
ప్రతి అణువు బృందా నికుంజమై పలికింది... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


మల్లెలు పూచే చల్లనివేళ... అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4888



No comments:

Post a Comment