Tuesday, January 30, 2018

సిగలోకి విరులిచ్చి

చిత్రం :  సుమంగళి (1965)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల




పల్లవి :



సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా



సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా



చరణం 1 :



పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా
పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా


తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా


సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా



చరణం 2 :



తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా


కోరినది చేతికి చిక్కి...  ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక...  ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం


సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా


అంధుని ఎదుట అందాలేలా?
అడవిని పున్నమి వెన్నెలలేలా?
అసమర్థునికి అవకాశాలేలా..
వృధా వృధా... ఈ బ్రతుకు వృధా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1069

No comments:

Post a Comment