Thursday, February 1, 2018

సంబరాలా సంకురాతిరి

చిత్రం :  ఊరంతా సంక్రాంతి (1983) 
సంగీతం :  బాలు
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం : బాలు, జానకి, సుశీల



పల్లవి :




సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..


ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా


సంబరాలా సంకురాత్రి..ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో
ఆడా మగ ఆడిపాడే పాటల్లో..


ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

తన తనెతాన తానాన తానా
తన తననాన తానె తానా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 



చరణం 1 :




అందాలే ముద్దులిచ్చి...  బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి...  గంధాలు పూసేను


అ రె రె రె రె...
లోగిళ్ళలోన సిగ్గులన్ని వెల్లలేసే..  ప్రేమ రంగులేసే
కన్నెపిల్లలో సోకు పండిందనీ
కాపు కావాలనీ...  తోడురావాలనీ..హోయ్


అందాలే ముద్దులిచ్చి... బంధాలు వేసేను
గారాలే ముడులువేసి... గంధాలు పూసేను
ఆ ఆ ఆ ఆ ఆ..


అల్లీ అల్లని పందిట్లో... అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో... ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే... మ్రోగాలనీ



హోయ్... సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో


ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా

ఓఓ ఓహో... తానా తానా తానా తానా తానా ఆ తాననా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా



చరణం 2 :






వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను.. హా 


కళ్ళల్లోని ఆశలన్ని కొండా కొచ్చేసై...  ముడుపులిచ్చీ
గుండెచాటు కలలన్ని తీరాలనీ... వలపు సాగాలనీ... రేవు చేరాలనీ


హోయ్..వయ్యారం వలపువాకిట... చిరు చిందులేసేను
సింగారం తలపు చాటున... తొలి ఊసులాడేను


ఆహా హా..నవ్వీ నవ్వని నవ్వుల్లో... తెలిసీ తెలియని పరవళ్ళు
కలసీ కలవని కళ్ళల్లో... తీరీ తీరని ఆకళ్లు
తీరే రోజు రేపో మాపో రావాలనీ..హోయ్




సంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీ
ముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి గొబ్బిల్లో


ఆడా మగ ఆడిపాడే పాటల్లో..
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా
ఏడాదికోపండగా... ఆ... బ్రతుకంత తొలిపండగా





No comments:

Post a Comment