Monday, February 5, 2018

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ

చిత్రం :  విచిత్ర జీవితం (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు   

పల్లవి :

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 

చరణం 1 :

ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఈనాటి ఏకా౦త సమయం... ఏ రేయి లేనంత మధురం
చెలియా ఈ మౌన వేళ...  నన్ను అలవోలే చెలరేగి పోనీ 

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 

చరణం 2 :

ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
జగమేలు పరమాత్ముడైనా... మన జంట విడదీయరాదు
నీ కళ్ళలో నేను దాగీ... నిన్ను నా గుండెలో దాచుకోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 

చరణం 3 :

కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎంతెంతొ కాలం... తీపికలలన్ని పండించుకోగా
రగిలే ఈ హాయిలోనా...  నన్ను బతుకంత జీవించిపోనీ

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1270

2 comments:

  1. పల్లవి : నిత్య కళ్యాణిగా చూసుకోనీ...
    చరణం 1 : కన్నీట సాగింది బ్రతుకు... & ఈనాటి ఏకా౦త సమయం...
    చరణం 3 : కావాలి ఎంతెంతొ కాలం...

    ReplyDelete