Monday, February 5, 2018

చల్లని బాబూ

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి :



చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే
మా ఇంటి దీపం నీవే
చల్లని బాబూ... నా అల్లరి బాబూ 



చరణం 1 :



పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వేసేవు
నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను 



బాబూ...
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటిపాపవు నీవే... మా ఇంటి దీపం నీవే 



చరణం 2 :



ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను
ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను


అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు 


చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే మా ఇంటి దీపం నీవే



చరణం 3 :



నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా
చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా 


నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా
నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6518

No comments:

Post a Comment