Monday, June 25, 2018

నువ్వూ.. నేనూ.. నడిచేది

చిత్రం : డబ్బుకు లోకం దాసోహం (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 



పల్లవి : 


ఎక్కడికో?
తమరెక్కడికో?
హహ చెప్పనా?
ఊఁ... 


నువ్వూ.. నేనూ.. నడిచేది.. ఒకే బాట ఒకే బాట
అవునా?
నువ్వూ.. నేనూ.. పలికేది.. ఒకే మాట ఒకే మాట 


ఆ బాట ఏనాడు తిరుగులేనిదీ..ఈ..
ఆ మాట ఏనాడు తీరిపోనిదీ..ఈ..
ఆ బాట ఏనాడు తిరుగులేనిదీ..ఈ..
ఆ మాట ఏనాడు తీరిపోనిదీ..ఈ..
నువ్వూ.. నేనూ.. నడిచేది.. ఒకే బాట ఒకే బాట.. 


చరణం 1: 


దూరాన శిఖరాలు ఉన్నాయి.. వాటిని చేరుకునే పాదాలను రమ్మన్నాయి
దూరాన శిఖరాలు ఉన్నాయి.. వాటిని చేరుకునే పాదాలను రమ్మన్నాయి 


తూరుపునా కిరణాలు ఉదయించాయి.. తూరుపునా కిరణాలు ఉదయించాయి
గగనతీరాలలో అందుకోను పయనించాయి.. గగనతీరాలలో అందుకోను పయనించాయి 


మరి మన పయనం ఎందాకా.. ఎందాకా..ఆ..
ఆ శిఖరాలు తీరాలు అందేదాకా..ఆ.. 


నువ్వూ.. నేనూ.. నడిచేది.. ఒకే బాట ఒకే బాట.. 


చరణం 2: 


చిరుగాలిలో.. ఏవో.. నాదాలు ఉన్నాయి..
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి..
చిరుగాలిలో.. ఏవో.. నాదాలు ఉన్నాయి..
అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి.. 


వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి..
వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి..
అవి.. ముత్యపు చిప్పల్లో.. పడితేనే.. ముత్యాలు అవుతాయి.. 


మంచి ఆశయాలుంటే.. మానవులందరూ.. మచ్చలేని వెలుగునే.. చేరుకొందురూ..
మంచి ఆశయాలుంటే.. మానవులందరూ.. మచ్చలేని వెలుగునే.. చేరుకొందురూ..ఊ.. 


నువ్వూ.. నేనూ.. నడిచేది.. ఒకే బాట ఒకే బాట
నువ్వూ.. నేనూ.. పలికేది.. ఒకే మాట ఒకే మాట 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=688

No comments:

Post a Comment