Friday, June 29, 2018

ఎవరికి తెలియదులే

చిత్రం : దొరికితే దొంగలు (1965)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి : 


ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఇంతుల సంగతి పూబంతుల సంగతి


ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి


చరణం 1 : 



జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు
జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు
బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు
బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు


ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు
ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు
ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు... హా



ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి



చరణం 2 : 


ముసిముసి నగవులతో... మిసమిస చూపులతో
ముసిముసి నగవులతో... మిసమిస చూపులతో
దాచుకున్న తలపులతో... దోచుకున్న వలపులతో
దాచుకున్న తలపులతో... దోచుకున్న వలపులతో



మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు
మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు
మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు



ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి



చరణం 3 :


పందిరి లేకుంటే... తీగ పైకి పోతుందా
పందిరి లేకుంటే... తీగ పైకి పోతుందా
గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా
గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా


పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా
పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా
పురుషులు లేకుంటే... తరుణుల పని గోవిందా... గోవిందా... హా..



ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి
ఇంతుల సంగతి పూబంతుల సంగతి

ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=77

No comments:

Post a Comment