Tuesday, July 3, 2018

ఇంద్రధనుస్సు చీర కట్టి

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి :

ఇంద్రధనుస్సు చీర కట్టి... చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట... సూర్యుడికే కునుకొచ్చిందంట

ఇంద్రధనుస్సు చీర కట్టి... చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట... జాబిలికే నడకొచ్చిందంట

చరణం 1 :

నడిరేయి సమయాన...  ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా

ప్రేమ అనే కౌగిలిలో...  పెళ్లి అనే పందిరిలో
ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయెనే
ఇద్దరొక్కటైన పాట మనుగడాయెనే

ఇంద్రధనుస్సు చీర కట్టి...  చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట...  జాబిలికే నడకొచ్చిందంట

చరణం 2 :

ఆరారు ఋతువుల్లో...  అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితేనెలో తానమాడించానా

పరువమనే పల్లకిలో అందమనే బాలికలా
వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు
పిలుపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో

ఇంద్రధనుస్సు చీర కట్టి...  చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట...  సూర్యుడికే కునుకొచ్చిందంట

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=846

No comments:

Post a Comment