Tuesday, July 3, 2018

నీ ఇల్లు బంగారంగాను

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి




పల్లవి :


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నావు జోడు కడతావా...
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా...
మురిపాల మీగడంతా తోడిపెడతావా


Gold man .. అహా Gold man




చరణం 1 :



బంగారు కొండమీద...  శృంగార కోటలోన...
చిలకుంది తెమ్మంటావా... చిలకుంది తెమ్మంటావా
రతనాల రాతిరేళా పగడాల పక్క చూపి... పలికింది రమ్మంటావా


ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా... హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో... నీకందాక పని ఉంటే నన్ను చూసుకో


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను



చరణం 2 :



వజ్రాలవాడలోన...  వైఢూర్యమంటి నన్ను...
వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా
ముత్యాల మేడలోనా... మాణిక్యమంటి నన్ను.. ముద్దాడ వస్తుంటావా


వరహాల పందిట్లో విరహాలు నీకేల... రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో... ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నావు జోడు కడతావా... మురిపాల మీగడంతా తోడిపెడతావా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=845

No comments:

Post a Comment