Monday, July 9, 2018

ఒకే రాగం ఒకే తాళం

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల


పల్లవి :



ఒకే రాగం...  ఒకే తాళం...
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా





చరణం 1 :



కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ
ఆ... ఆ... ఆ... ఆ... ఆ
కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ


విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో... ఒకే అనురాగమే
విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో...  ఒకే అనురాగమే


ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా 



చరణం 2 :



నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు
ఆ...  ఆ... ఆ...  ఆ
నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు


తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే
తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే



ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18312

No comments:

Post a Comment