Monday, August 13, 2018

ఒకరి మనసు ఒకరికి

చిత్రం : నిండు సంసారం (1968)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల 

పల్లవి : 

ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...  

ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...  

చరణం 1 :

తొందరంత నాదని తొలగి తొలగిపోయావు
నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు 

ఆరాలు తీరెలే... దూరాలు కరిగెలే
ఇరువురి హృదయాలు తీరాలు చేరెలే

ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...  

చరణం 2 :

చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై...
చల్లని చిరుగాలికి అల్లుకున్న తీగలమై...
కల్లకపటమెరుగక కలిసిపోదాములే

నల్లని నీ కురులలో తెల్లని పూమాలవలే...
చీకటివెలుగులలో ఏకముగా ఉందాము  

ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే...
  
చరణం 3 :

ఇన్నినాళ్ళ నా పరువం నిన్ను చేరుకుందిలే
నీ కన్నుల వెన్నెలలో నిగనిగలాడిందిలే ... 

కన్నులలో పాపలా నిన్ను దాచుకున్నాను
ఎన్నెన్ని జన్మలకు నిన్ను విడువలేనులే

ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే... తెలుసులే
అణగి ఉన్న ఆశలు ఈనాడు తీరునులే..

1 comment: