Tuesday, August 28, 2018

మిలమిల మెరిసే మనసే

చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 



మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...
ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...



చరణం 1 :



కానరాని ఆకాశదీపం కనుల ముందే వెలిగిందిలే
ఏ... ఏ... కానరాని ఆకాశదీపం కనుల ముందే వెలిగిందిలే
మూగవోయిన రాగమాల మురిసి విరిసి పలికిందిలే 



ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...
ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...



చరణం 2 :



కరిగిపోయే అందాల కలలే తిరిగి నాలో అగుపించెనే
ఏ.. కరిగిపోయే అందాల కలలే తిరిగి నాలో అగుపించెనే
వాడిపోయే ఆశలన్నీ నేడే నాలో చిగురించెనే



ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...
ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...




చరణం 3 :



గుండెలోనా కొలువైన స్వామి పండునవ్వులు చిలికించెనే
ఏ... గుండెలోనా కొలువైన స్వామి పండునవ్వులు చిలికించెనే
చేసుకున్నా పూజలన్నీ పూచి కాచి ఫలియించెనే  



ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...
ఓ... మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగసి దూకిందిలే...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=87

No comments:

Post a Comment