Sunday, August 12, 2018

దేవుడున్నాడా

చిత్రం : నిండు సంసారం (1968)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల 


పల్లవి : 


దేవుడున్నాడా... ఉంటే నిదుర పోయాడా?
దారుణాలు చూడలేక... రాయిలాగ మారాడా?
దేవుడున్నాడా .... ఆ ఆ ఆ



చరణం 1 :



మారలేదు చందమామ... మారలేదు సూర్యబింబం..
జగతిలోన మార్పులేదు... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జగతిలోన మార్పులేదు... మనిషి ఏలా మారిపోయె?


దేవుడున్నాడా .... ఆ ఆ ఆ



చరణం 2 :



లోకాన బాధలన్నీ మా కొరకే ఏకమాయె
లోకాన బాధలన్నీ మా కొరకే ఏకమాయె
కష్టాలు మమ్ము చూసి... ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కష్టాలు మమ్ము చూసి... పండుగలే చేసుకున్నాయి


దేవుడున్నాడా .... ఆ ఆ ఆ



చరణం 3 :



నీతికేమి ఫలితంలేదు... స్వార్థానికి విజయం నేడు
కనరాదు ఆశాకిరణం... ఆ ఆ ఆ ఆ ఆ
కనరాదు ఆశాకిరణం... వలదింక పాడులోకం



దేవుడున్నాడా .... ఆ ఆ ఆ

No comments:

Post a Comment