Thursday, August 30, 2018

జేబులో బొమ్మ

చిత్రం : రాజు-పేద (1954)
సంగీతం :  ఎస్.రాజేశ్వరరావు
గీతరచయిత :  కొసరాజు
నేపథ్య గానం :  ఘంటసాల 



పల్లవి :  



జేజేలను విని గొప్పవారమని
చెడ్డపనులమాచేత చేయింపకుమా ఆ…ఆ…ఆ…


హేయ్
జేబులో బొమ్మ...  జేబులో బొమ్మ
జేజేల బొమ్మ...  జేబులో బొమ్మ
జేజేల బొమ్మ... జేబులో బొమ్మ



చరణం 1 :



మొక్కిన మొక్కులు సల్లంగుండి
మొక్కిన మొక్కులు సల్లంగుండి
ఎనక్కి తిరక్క గెలుస్తు ఉంటే
భక్తితోడ నీ విగ్రహానికి బంగరుతొడుపేయించెదనమ్మ



జేబులో బొమ్మ...  జేజేల బొమ్మ
జేబులో బొమ్మ



చరణం 2 :



కనక తప్పెటలు ఘణఘణ మ్రోయగ
శంఖనాదములు శివమెత్తించగ
కనక తప్పెటలు ఘణఘణ మ్రోయగ
శంఖనాదములు శివమెత్తించగ
చేసిన తప్పులు చిత్తైపోవగ... చేతులెత్తి ప్రార్దించెదనమ్మా



జేబులో బొమ్మ...  జేజేల బొమ్మ
జేబులో బొమ్మ



చరణం 3 :



మారాజులకు మనసులు మారి... మంత్రి పదవి నా తలపైకొస్తే...
ఏ… ఏ… ఏ… ఏ…
మారాజులకు మనసులు మారి... మంత్రి పదవి నా తలపైకొస్తే
వేడుక తీరగ పూస కూర్పుతో... జోడు ప్రభల కట్టించెదనమ్మా


జేబులో బొమ్మ...  జేజేల బొమ్మ
జేబులో బొమ్మ  



చరణం 4 :



మా ఇలవేల్పుగ మహిమలు జూపి... మల్లికి నాకు మనసుగల్పితే
బొమ్మా..
మా ఇలవేల్పుగ మహిమలుజూపి... మల్లికి నాకు మనసుగల్పితే
తకిట తధిగిన తక తై అంటూ... చెక్క భజన చేయించెదనమ్మా


జేబులో బొమ్మ...  జేజేల బొమ్మ
జేబులో...  జేబులో...  జేబులో బొమ్మ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=30

No comments:

Post a Comment