Thursday, August 9, 2018

రానిక నీకోసం

చిత్రం :  మాయని మమత (1970)
సంగీతం : అశ్వత్థామ
గీతరచయిత :  దేవులపల్లి
నేపథ్య గానం :  ఘంటసాల 


పల్లవి :



రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం


రాలిన సుమాలు ఏరుకొని...  జాలిగ గుండెల దాచుకోని
ఈ దూరపు సీమలు చేరుకొని
రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం



చరణం 1 :


వాకిటిలో నిలబడకు...  ఇంక నాకై మరిమరీ చూడకు .. చూడకువాకిటిలో నిలబడకు...  ఇంక నాకై మరిమరీ చూడకు


ప్రతి గాలి సడికి తడబడకు...  పదధ్వనులని పొరబడకుకోయిలా కోయలే… గూడు గుబులై పోయేలే….

రానిక నీకోసం సఖీ...  రాదిక వసంత మాసం




చరణం 2 :


పగలంతా నా మదిలో మమతలు సెగలై లో లో రగులునులే
నిద్రరాని నిశినైనా నాకు నిష్టుర వేదన తప్పదులే
పోనీలే… ఇంతేలే.. గూడు గుబులై పోయేలే ..


రానిక నీకోసం సఖీ... రాదిక వసంత మాసం…రాదిక వసంత మాసం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=226

No comments:

Post a Comment