Monday, August 20, 2018

మొగలీరేకుల సిగదానా

చిత్రం :  పాండవ వనవాసం (1965)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  కొసరాజు
నేపథ్య గానం :  ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 



పల్లవి :


ఓ...ఓ...ఓ..ఓ...ఓ...ఓ...
ఓ...ఓ...ఓ..ఓ...ఓ...ఓ...
ఆ..అ...ఆహహ...
లలలలల... ఆ.. ఆ.. ఆ.. అ... అహా..

మొగలీరేకుల సిగదానా... మురిడీ గొలుసుల సినదానా
రావే నా సిలకా... హొయ్...  ఏమే ఈ అలకా...


అహ..హ.అ.. అహ.. ఓహో.. హో..


చిలిపిచూపుల చిన్నోడా... చెవులాపోగుల పిల్లోడా
చాలు నీ గోలా... నా ఊసూ నీకేలా




చరణం 1 :


కొసరి కొసరి రమ్మంటేనూ... ఇసురుకుంటు అటు ఉరికావూ
ఒయ్... ఇసురుకుంటు అటు ఉరికావూ


ఏటినీళ్ళకెడుతుంటే..హోయ్... పైట పట్టుకొని గుంజావూ
పైట పట్టుకొని గుంజావూ


సరసానికి చేశానే.... ఓ.. ఓ.... వరసలాడి మురిశానే
సరసానికి చేశానే.... ఓ.. ఓ.... వరసలాడి మురిశానే

నలుగురిలోనా కొంటెతనానా నవ్వులపాలు చేశావు


చిలిపిచూపుల చిన్నోడా... చెవులాపోగుల పిల్లోడా
చాలు నీ గోలా... నా ఊసూ నీకేలా



చరణం 2 : 



బుద్ధి తెలిసెనే వయ్యారి... ముద్దు తీర్చవే ఒకసారి
హోయ్..  ముద్దు తీర్చవే ఒకసారి


వగలమారి మొనగాడా... వదలకోయి ఇక నా నీడా
వదలకోయి ఇక నా నీడా


ఇద్దరమొకటైతేనూ... ఓ..హో..హోయ్
ఎడమేలేకుంటేనూ... ఓ..హో..హోయ్

ఇద్దరమొకటైతేనూ... ఎడమేలేకుంటేనూ
కలతలు తీరా... పులకలు మీరా... కమ్మగ కాలం గడిచేనూ


చిలిపిచూపుల చిన్నోడా... మొగలీరేకుల సిగదానా
ఆహహ్హా.. హా..హోయ్.. హో..హో..హో... హోయ్...






No comments:

Post a Comment