Tuesday, September 25, 2018

మా పాప పుట్టినరోజు

చిత్రం  :  సంసారం (1975)
సంగీతం  : టి. చలపతిరావు
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :  బాలు, సుశీల  

పల్లవి :

మా పాప పుట్టినరోజు... మరపురాని పండుగరోజు
కలతలన్నీ కరిగిపోగా... కలసీ... మెలసీ... మురిసేరోజు

చరణం 1 :

చిందులు వేసే మా పాప... కంటికి విందులు చేయాలి

పెరిగి పెద్దదై చదువులు చదివి... పెద్దలు మన్నలు పొందాలి

మా పాప పుట్టినరోజు... మరపురాని పండుగరోజు 

చరణం 2 :

మల్లెలలోనీ చల్లదనాలు... మనసులలో విరబూయాలి

మమతల దివ్వెల నవ్వులతో...
మమతల దివ్వెల నవ్వులతో.... మన ఇల్లంతా వెలగాలి

మా పాప పుట్టినరోజు... మరపురాని పండుగరోజు 

చరణం 3 :

ఎవ్వరికీ తలవంచకనే... ఎన్నడు నిరాశ చెందకనే

ఆత్మగౌరవం పెంచుకొని... అడుగు ముందుకే వేయాలి 

మా పాప పుట్టినరోజు... మరపురాని పండుగరోజు
కలతలన్నీ కరిగిపోగా... కలసీ... మెలసీ... మురిసేరోజు

మా పాప పుట్టినరోజు... మరపురాని పండుగరోజు 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6531

No comments:

Post a Comment