Tuesday, September 11, 2018

సరదా సరదా సిగిరెట్టు

చిత్రం :  రాముడు-భీముడు (1964)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  కొసరాజు
నేపథ్య గానం :  మాధవపెద్ది , జమునా రాణి 

పల్లవి :

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే...  స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా...  వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

చరణం 1 :

 ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ...
మీసాలు కాల్చుకోవచ్చూ

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ

చరణం 2 :

ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ

కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

చరణం 3 :

 ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకుముక్కు ఎగరేస్తారు...
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించినారందుకే...
కలెక్షన్లు లేవందుకే

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

చరణం 4 :

కవిత్వానికి సిగిరెట్టు...  కాఫీకే యిది తోబుట్టు.
పైత్యానికి యీ సిగిరెట్టు...  బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు...  ఆలోచనలను గిలకొట్టు
వాహ్...పనిలేకుంటే సిగిరెట్టూ...  తిని కూర్చుంటే పొగపట్టూ

రవ్వలు రాల్చే రాకెట్టూ...  రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ...  దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ

సరదా సరదా సిగిరెట్టూ...  ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు...  దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6101

No comments:

Post a Comment