Tuesday, September 25, 2018

ఒంటరిగా ఉన్నామూ

చిత్రం  :  సంసారం (1975)
సంగీతం  : టి. చలపతిరావు
గీతరచయిత  :  సినారె
నేపథ్య గానం  :  జానకి, రమేష్ 




పల్లవి :


ఒంటరిగా ఉన్నామూ... మనమిద్దరమే ఉన్నామూ
ఉలకవెందుకు... పలకవెందుకు..
బిడియమెందుకు...  వలపు విందుకు..
కలసి పోదాము రా... రా..


ఒంటరిగా ..హ్హా..హ్హా..హ్హా... ఉన్నామూ
మనమిద్దరమే..హె..హె..హె... ఉన్నామూ..


చరణం 1 :



ఎవరికంటపడినా... ఏమనుకొంటారూ..
పడుచువాళ్ళ సరదా... పోనీ అంటారూ
ఎవరికంటపడినా... ఏమనుకొంటారూ..
పడుచువాళ్ళ సరదా... పోనీ అంటారూ



ఏదో గుబులు... ఎందుకు దిగులు
ఏదో గుబులు... ఎందుకు దిగులు
ఎగిరిపోదాము రా... రా..


ఒంటరిగా ..హ్హా..హ్హా..హ్హా... ఉన్నామూ
మనమిద్దరమే..హె..హె..హె... ఉన్నామూ..




చరణం 2 :



గువ్వజంట ఏదో... గుసగుసలాడిందీ
వలపు ఓనమాలూ... దిద్దుకోమన్నదీ
గువ్వజంట ఏదో... గుసగుసలాడిందీ
వలపు ఓనమాలూ... దిద్దుకోమన్నదీ


ఇపుడేవద్దు... ఒకటేముద్దు
ఇపుడేవద్దు... ఒకటేముద్దు
రేపుచూద్దాము రా..రా..




ఒంటరిగా ..హ్హా..హ్హా..హ్హా... ఉన్నామూ
మనమిద్దరమే..హె..హె..హె... ఉన్నామూ..




చరణం 3 :


ఇంతమంచి సమయం... ఎపుడు దొరుకుతుందీ
మూడుముళ్ళుపడనీ... ప్రతిరోజు దొరుకుతుందీ
ఇంతమంచి సమయం... ఎపుడు దొరుకుతుందీ
మూడుముళ్ళుపడనీ... ప్రతిరోజు దొరుకుతుందీ



అప్పటి వరకు అల్లరివయసు
అప్పటి వరకు అల్లరివయసు
ఆగనంటుంది.. రా..రా..


ఒంటరిగా ఉన్నామూ... మనమిద్దరమే ఉన్నామూ
ఉలకవెందుకు... పలకవెందుకు..
బిడియమెందుకు...  వలపు విందుకు..
కలసి పోదాము రా... రా..


ఒంటరిగా ..హ్హా..హ్హా..హ్హా... ఉన్నామూ
మనమిద్దరమే..హె..హె..హె... ఉన్నామూ..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=783

No comments:

Post a Comment