Tuesday, November 20, 2018

ఆడవే రాజహంస

చిత్రం :  వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస



చరణం 1 :


తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం
తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం
అరుణిమ చరణాల విరిసిన ఉదయాల... కళలే నాలోన కురిసే మకరందం


నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే
నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే


రావే.. మనుగడవు కావే... మధువనివి నీవే
నీవే నేనైపోవే...



పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం
ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం



చరణం 2 :



లలలలా... లలలల... ఆ.. ఆ.. హ..
ఆ.. హా.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు  గిలిగింత పెడితే
కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు  గిలిగింత పెడితే

కలలకు సెలవేది కమ్మని కలతై... వయసుకు పులకింత నీవైతే


కూసంతా వెన్నెల్లలో... వయసంతా వయ్యారమై...
పూసింది పున్నాగలా... మెరిసేటి మిన్నాగులా
ఎదయ విరుల పొదల నీడలా... ఆ... ఆ.. ఆ


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస


ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం   




చరణం 3 :


సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం
సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం

కడలిని పొంగించి... సుధలను చిందించు జతులే నీ నోట పలికే నవలాస్యం


కాలాలు కరిగి గతమవ్వు దాక నీ కౌగిలింత నాదే...
లోకాలు సురిగి కథలవ్వు దాక నా జలదరింత నీదే


నాలో రసధునివి నీవే... ఉదయినివి కావే
నాలో వెలుగై పోవే....



పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం 


లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా
ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=886

No comments:

Post a Comment