Thursday, April 12, 2018

ఎవ్వాని వాకిట

చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
రచయిత : తిక్కన
నేపధ్య గానం : ఘంటసాల 


పద్యము : 
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలతలేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు


నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు


ఎవ్వాని వాకిట - ఎవరి వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో)


ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)


ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)


ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
అతడు - ధర్మరాజు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాజుకు కొడుకైన యుధిష్టిరుడు.


ధర్మరాజు వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.


అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.


ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా... కాదు. స్వయానా యమధర్మ రాజు కొడుకు అని అర్థం. అంటే ధర్మానికి ప్రతీకే ధర్మరాజు అని చెప్పడమే.


ఇది తిక్కనగారి పద్యము. ఈ మాట ద్రౌపది భీమార్జునలతో అంటుంది. నర్తనసాల సినిమాలో మాత్రము అర్జునుడు(బృహన్నల) ద్రౌపది, భీముడితో ధర్మరాజు గురించి చెప్పిన పద్యము.
Wednesday, April 11, 2018

కాంచనమయ వేదికా

చిత్రం : నర్తనశాల (1963)

సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి

రచయిత : తిక్కన 

నేపధ్య గానం : ఘంటసాల 


పద్యము : ఉత్తర కుమారుడికి కౌరవ సేనను పరిచయం చేస్తూ...
కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాఁడు కృపుఁడు
లలిత కంబుప్రభాకలిత పతాకా విహారంబువాఁడు రాధాత్మజుండు


మణిమయోరగ రుచిజాల మహితమైన
పడగవాఁడు కురుక్షితిపతి మహోగ్ర
శిఖరఘన తాళతరువగు సిడమువాఁడు
సురనదీసూనుఁ డేర్పడఁ జూచికొనుము"కాంచనమయ వేదికా కనత్కేతనోజ్జ్వల విభ్రమమువాఁడు కలశజుండు "
బంగారు రంగుతో చేసిన వేదిక మీద ప్రకాశిస్తున్న జెండా కల రథం మీద ఉన్నవాడు
‘కలశజుండు : (కుండలో పుట్టిన వాడు ) : ద్రోణుడు


"సింహ లాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణమువాఁడు ద్రోణసుతుడు " :
సింహపు తోకతో అలంకరించి ఉన్న రథంపై విరాజిల్లుతున్నవాడు ద్రోణసుతుడు అశ్వత్థామ.


"కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుటధ్వజ సముల్లాసంబు వాఁడు కృపుఁడు " :
బంగారు ఆవు-ఎద్దుల జంట గుర్తుగా కలిగినవాడు కృపుడు.


"లలితకంబు ప్రభాకలిత పతాకావిహారంబువాఁడు రాధాత్మజుండు "
"లలితంబుగా ప్రభావితమౌతున్న శంఖం పతాకముగా కలవాడు రాధ కుమారుడు కర్ణుడు.


"మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాఁడు కురుక్షితిపతి "
"మణులతో పొదిగిన పడగ గల నాగు పాము పతాకముగా కలవాడు కురు క్షితి పతి.. దుర్యోధనుడు.


"మహోగ్ర శిఖర ఘన తాళతరువగు సిడమువాఁడు సురనదీసూనుడు"
బ్రహ్మాండమైన తాళవృక్షం జెండాగా ఉన్నవాడు
సురనదీసూనుడు.. సురనదీ : గంగ
సూనుడు : కొడుకు ... భీష్మాచార్యుడు.


ఏర్పడఁజూచికొనుము : బాగా తేరిపార చూడు


కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు.తిక్కనగారు చేసిన చమత్కారం ఏమిటంటే... అందరికీ కేతనమనో, కేతువనో వాడక ఒకొక్కరికి ఒకో పదము వాడారు. కేతనము, కేతువు, ధ్వజము, పతాకము, పడగ, సిడము.

Friday, April 6, 2018

బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యాచిత్రం : పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : ఊటుకూరి సత్యనారాయణ
నేపధ్య గానం : ఎ.పి.కోమల, కె. రాణి, ఉడుతా సరోజినిపల్లవి :

బ్రహ్మయ్యా... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా
బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా


లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను....
లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను
నాకు పెళ్ళి చేయనిచో ఇంక బ్రతుకలేనయ్యా
బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యాచరణం 1 :ఏరికోరి తెస్తినిరా... నీకు తగిన పిల్లరా
మారుమాటపల్కదురా... మురిపమెల్ల తీర్చుకోరా
మారుమాటపల్కదురా... మురిపమెల్ల తీర్చుకోరా


అహహా.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఎంత గొప్ప దేవుడవో... నాదు కోర్క తీర్చినావు
ఇంక నేను ధన్యుడను... నీదు మేలు మరువనయ్యా


బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యాచరణం 2 :


ఏయ్... ఇదిగో...
చూడు.. నిన్నే.. నేను.. నీ భర్తని...
అరే పల్కదే....


మారుపల్కదేమయ్యా... మూగపిల్లనిచ్చావా... ఆ... ఆ..
మారుపల్కదేమయ్యా... మూగపిల్లనిచ్చావా...
నోరు ఇచ్చి కావవయ్యా.. భక్తులతో పరిహాసమా...


మేలుకోరి ముత్తినిరా... గళము విప్పమనకురా 
నోరు గలా భార్యలతో నరులు వేగలేరురా
నోరు గలా భార్యలతో నరులు వేగలేరురా


నీకెందుకు నేవేగెద.. నోరు విప్పి పోవయ్యా
అయితే ఇక నీ ఖర్మం... అనుభవించు తిమ్మయ్యా
తిమ్మయ్యా.. ఓ తిమ్మయ్యా


చరణం 3 :


ఒహొ.. హో.. ఓ.. ఓ.. ఓ.. ఓ...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
ప్రేయసీ.. ఓ ప్రియా.. ఆ.. ఆ... నా ప్రియా
ప్రేయసీ.. ఓ ప్రియా.. ఆ.. ఆ... నా ప్రియా


ప్రియము సోపు నోరుమూసుకొని కొనితేవోయ్...
నోరుమూసుకొని కొనితేవోయ్...
మాయలు సేకో.. సెంటూ పౌడర్.. ఇంపుగ పోయే డ్యూక్ కార్
గోల్డు వాచి... ముఖమల్ స్లిప్పర్.. ముచ్చటగొలిపే బొచ్చుకుక్కా
అవ్వా.. హా... ఆ...
గోల్డు వాచి... ముఖమల్ స్లిప్పర్.. ముచ్చటగొలిపే బొచ్చుకుక్కా
కోరినవన్నీ నోరు మూసుకొని కొనితేవోయ్...
లేకపోతే విడాకులోయ్... ఆ 


ఔరా ఇంత గయ్యాళిని మెడకు గట్టినావయ్యా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఔరా ఇంత గయ్యాళిని మెడకు గట్టినావయ్యా
పోరు తాళలేనయ్యా... నోరు మరలమూయవయ్యా
బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా


చరణం 4 :


నా నోటిని మరలమూయ ఎవరికేన తరమౌనా?
నా నోటిని మరలమూయ ఎవరికేన తరమౌనా?
ఏది రమ్మను చూద్దాం.. బ్రహ్మ ఎట్టి తెలిసేనో 


ఔనమ్మా.. ఔ.. ఔనమ్మా
ఔనమ్మా.. ఔ.. ఔనమ్మా
నా చేతుల కాని పని స్త్రీల నోరు మూయడమే...
ఆ... ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ
నా చేతుల కాని పని స్త్రీల నోరు మూయడమే...
తల్లీ నే వాగలేను.. పోయి వచ్చు శెలవిమ్మ


ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు...
ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు...
బ్రహ్మయ్యా... ఓ బ్రహ్మయ్యా


Monday, April 2, 2018

హైలో హైలెస్స

చిత్రం :  భీష్మ (1962)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  జమునా రాణి  


పల్లవి :ఓ... ఓ... ఓ..ఓ... ఓ... ఓ..
అహా.. హా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


హైలో హైలెస్స... హంస కదా నా పడవ
హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ


ఓ... హొయ్... ఓ... హొయ్చరణం 1 :


ఓ... ఓ... ఓ...
ఓ... ఓ... ఓ...


నదిలో నా రూపు...  ఓ... ఓ... ఓ...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...
నదిలో నా రూపు నవనవలాడినది...
మెరిసే అందములూ మిలమిలలాడినవి...


వయసు వయ్యారము పాడినవి పదేపదే
వయసు వయ్యారము పాడినవి పదేపదే


హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ


ఓ... హొయ్... ఓ... హొయ్చరణం 2 :ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ...


ఎవరో మా రాజూ..ఓ..ఓ..
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఎవరో మా రాజూ... ఎదుటా నిలిచాడు
ఏవో చూపులతో సరసకు చేరాడు...
ఏవో చూపులతో సరసకు చేరాడు...


మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...
మనసే చెలించునే మాయదారి మగాళ్ళకి...


హైలో.. హైలో హైలెస్స... హంస కదా నా పడవ
ఉయ్యాలలూగినదీ... ఊగీసలాడినదీ...
హైలో హైలెస్స... హంస కదా నా పడవ


ఓ... హొయ్... ఓ... హొయ్ 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=147

Tuesday, March 27, 2018

ఇద్దరి మనసులు ఒకటాయె

చిత్రం :  భలే తమ్ముడు (1969)
సంగీతం :  టి. వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  మహమ్మద్ రఫీ, సుశీలపల్లవి  :


ఇద్దరి మనసులు ఒకటాయె...  సరిహద్దులు లేనే లేవాయె
ఇద్దరి మనసులు ఒకటాయె... సరిహద్దులు లేనే లేవాయెముద్దుల తలపులు మొదలాయె... మరి నిద్దుర రానే రాదాయె
ముద్దుల తలపులు మొదలాయె... మరి నిద్దుర రానే రాదాయె చరణం 1 :కనులు కనులు కలిసినపుడే... మనసు మనసూ మాటలాడె
కనులు కనులు కలిసినపుడే... మనసు మనసూ మాటలాడె
మరులు విరబూసె... 


ఇద్దరి మనసులు ఒకటాయె... సరిహద్దులు లేనే లేవాయె
ముద్దుల తలపులు మొదలాయె... మరి నిద్దుర రానే రాదాయెచరణం 2 :చేయి చేయి తాకగానే... హాయి ఏదో సోకగానే
చేయి చేయి తాకగానే... హాయి ఏదో సోకగానే
పైట బరువాయె.... ముద్దుల తలపులు మొదలాయె... మరి నిద్దుర రానే రాదాయె
ఇద్దరి మనసులు ఒకటాయె... సరిహద్దులు లేనే లేవాయె 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=665

నేడే ఈనాడే

చిత్రం :  భలే తమ్ముడు (1969)
సంగీతం :  టి. వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  మహమ్మద్ రఫీ, సుశీల   
పల్లవి  :


నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడే
నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడే


చరణం 1 :


అహహా ఆ... అహహా ఆ...
 అహహా ఆ... అహహా ఆ... 


కనులముందున్న రతనాలమూర్తిని... విలువలెరుగక విసిరితిని
కనులముందున్న రతనాలమూర్తిని... విలువలెరుగక విసిరితిని 


కనుల తెరచీ విలువ తెలిసి...
కనుల తెరచీ విలువ తెలిసి... మనసే గుడిగా మలచితిని


నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడే


చరణం 2 :మదిలో విరిసే మమతల మాలలు... చెలిమికి కానుక చేసెదను
మదిలో విరిసే మమతల మాలలు... చెలిమికి కానుక చేసెదను


ఆరని వలపుల హారతి వెలుగుల...
ఆరని వలపుల హారతి వెలుగుల... కలకాలం నిను కొలిచెదను 

నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడేచరణం 3 : 


అహహా ఆ... అహహా ఆ...
 అహహా ఆ... అహహా ఆ... 


చిలిపిగ కసిరే...
చిలిపిగ కసిరే...  చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను...  అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన...
చేతులు సాచి చెంతకు చేరిన ... ఆ చెలినే అందుకున్నాను...
ఆ చెలినే అందుకున్నాను...


నేడే.. ఈనాడే.. మురిపించె నన్ను చెలి తానే
నేడే.. ఈనాడే.. కరుణించె నన్ను చెలికాడే 


నేడే.. ఈనాడే.. మురిపించె నన్ను చెలి తానే 

అహహా ఆ... అహహా ఆ... 

అహహా ఆ... అహహా..ఓహో..హో.. 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=664

Monday, March 26, 2018

గోపాల బాల నిన్నే కోరి

చిత్రం :  భలే తమ్ముడు (1969)
సంగీతం :  టి. వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  మహమ్మద్ రఫీ 
పల్లవి  :గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ..హూ..హూ..హూ..
గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను... చరణం 1 : నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ....
హే..గీతా..ఆ..ఆ..ఆ నాథా..ఆ..ఆ..


నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ
గారాల బాలా మారాము చేయొద్దు..
బైరాగిని అనుకోవద్దు..నేను.. ఆ నేనే.. ఈ నేనూ


గొపాల బాల నిన్నే కోరి...  నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ... ఊ... 


చరణం 2 :ఏ మూఢులు కాదంటున్నా... నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ..
కృష్ణమ్మా..ఆ...ఆ..ఆ..ఆ


ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ


నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో..
మరి గట్టు మీద చేరుస్తావో..అంతా నీ భారమన్నాను..ఊ..ఊ


గోపాల బాల నిన్నే కోరి...  నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ...  చరణం 3 : సిరులంటే ఆశ లేదు...  వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే...  నా జీవిత లక్ష్యం అన్నాను..
సిరులంటే ఆశ లేదు...  వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే...  నా జీవిత లక్ష్యం అన్నాను..


నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక..
నీలో నన్నే చేర్చేదాక... నీడల్లే నిన్నంటే వుంటాను


గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను...ఊ..ఊ...
గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి..ఈ..ఈ
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ...
నీ చుట్టే తిరుగుతు వుంటాన... నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
నీ చుట్టే..నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
తిరుగుతు వుంటాను... తిరుగుతు వుంటాను..