Wednesday, March 5, 2014

అందమె ఆనందం

చిత్రం :  బ్రతుకు తెరువు (1953)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (జూనియర్)
నేపథ్య గానం : ఘంటసాల

పల్లవి:

అందమె ఆనందం... అందమె ఆనందం...
ఆనందమె జీవిత మకరందం...
అందమె ఆనందం...
అందమె ఆనందం...
ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం...

చరణం 1:

పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
పడమట సంధ్యారాగం...కుడి ఎడమల కుసుమపరాగం...
ఒడిలో చెలి మోహన రాగం...
ఒడిలో చెలి మోహన రాగం..
జీవితమే మధురానురాగం...
జీవితమే మధురానురాగం...

అందమె ఆనందం...
ఆనందమె జీవిత మకరందం...
అందమె ఆనందం...

చరణం 2:

పడిలేచే కడలితరంగం... ఓ... ఓ...
పడిలేచే కడలితరంగం...

వడిలో జడిసిన సారగం...వడిలో జడిసిన సారగం

పడిలేచే కడలితరంగం...వడిలో జడిసిన సారగం

సుడిగాలిలో... ఓ.. ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం...

జీవితమె ఒక నాటక రంగం...జీవితమె ఒక నాటక రంగం
అందమె ఆనందం...
ఆనందమె జీవిత మకరందం...
అందమె ఆనందం..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1000

1 comment:

  1. yes very good and great to hear mr LATE GANATHASALA GARU

    ReplyDelete