Tuesday, September 23, 2014

అదే నీవంటివి

చిత్రం :  సప్త స్వరాలు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల
 


పల్లవి :


అదే నీవంటివి.. అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ అవునంటిని


అదే నీవంటివి.. అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని
అదే నీవంటివి.. అదే నే వింటిని 


చరణం 1 :


ఎవ్వరు లేని పువ్వుల తోట... 

ఇద్దరు కోరే ముద్దుల మూట

ఆ........ ఆ....... ఆ....... ఆ........ ఆ

ఎవ్వరు లేని పువ్వుల తోట... 

ఇద్దరు కోరే ముద్దుల మూట

ఎదలో కదలాడి పెదవుల తెరవీడి... 

చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట

ఓ........ఓ.............ఓ.....

అదే నీవంటివి... అదే నే వింటిని... 


చరణం 2 :


పున్నమి రేయి పూసిన చోట... 

కన్నులు చేసే గారడి వేట
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పున్నమి రేయి పూసిన చోట... 

కన్నులు చేసే గారడి వేట


చూపులు జత చేసి.... ఊపిరి శృతి చేసి
తనువే జిల్లన కల్పించిన ఆ మాట...ఓ...ఓ....

అదే నీ వంటివి అదే నే వింటిని....



చరణం 3 :


నిన్ను నన్ను కలిపిన బాట... నీలో నాలో పలికిన పాట
ఆ....ఆ...ఆ...ఆ...
నిన్ను నన్ను కలిపిన బాట... నీలో నాలో పలికిన పాట


జాబిలి చెక్కిలగా... కౌగిలి దగ్గరగా...
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట...ఓ...ఓ...


అదే నీవంటివి అదే నే వింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని


అదే నీవంటివి అదే నేవింటిని...
అహ...హ...అహ...హా...ఊహు...ఉహు...

No comments:

Post a Comment