Saturday, September 20, 2014

తొలిసారి మిమ్మల్ని చూసింది

చిత్రం :  శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య :  జానకి    
 


సాకీ : 

శ్రీమన్ మహారాజ! మార్తాండ తేజా!

ప్రియానందభోజా! మీ శ్రీచరణాంభోజములకు 

ప్రేమతో నమస్కరించి... మిము వరించి

మీ గురించి ఎన్నో కలలు కన్న  కన్నెబంగారు

భయముతో... భక్తితో... అనురక్తితో... శాయంగల విన్నపములూ.. ఊ... ఊ... 


సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ

మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ

ఓ శుభముహూర్తానా...


పల్లవి :

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు 

కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు

ఎన్నెన్నో కథలు


జో అచ్యుతానంద.. జో జో ముకుందా.. 

లాలి పరమానంద.. రామ గోవిందా

జో జో... 


అనుపల్లవి :


నిదురపోనీ కనుపాపలకు జోల పాడలేక..

ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక...

ఇన్నాళ్లకు రాస్తున్నా

ఊహుహూహు... ప్రేమలేఖ  


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు.. ఎన్నెన్నో కథలు


చరణం 1 :




ఏ తల్లి కుమారులో తెలియదు కానీ

ఎంతటి సుకుమారులో తెలుసు నాకు


ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ

నా మనసును దోచిన చోరులు మీరు 


వలచి వచ్చిన వనితను చులకన చేయక

తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి

చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు... ఎన్నెన్నో కథలు


చరణం 2 :


తలలోన తురుముకున్న తుంటరి మల్లె

తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే 

ఆ... అబ్బా..


సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే 

నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే 

ఆహ్....  ఆహ్

మీ జతనే కోరుకొని లతలాగా అల్లుకొనే 

నాకు మీరు మనసిస్తే.. ఇచ్చినట్టు మాటిస్తే

ఇప్పుడే బదులివ్వండీ... ఇప్పుడే బదులివ్వండి 


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

కదిలాయి మదిలోన ఎనెన్నో కథలు... ఎన్నెన్నో కథలు 



No comments:

Post a Comment