Saturday, September 13, 2014

రాగాలా పల్లకిలో కోయిలమ్మా

చిత్రం :  శుభలేఖ (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :

లా... లా... లా....

రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రాలేదూ ఈ వేళా ఎందుకమ్మా


'నా ఉద్యోగం పోయిందండి..'

'తెలుసు .. అందుకే .. '


రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా


రాగాలా పల్లకిలో కోయిలమ్మా .. రాలేదు ఈ వేళా ఎందుకమ్మా
రాలేదు ఈ వేళా కోయిలమ్మా .. రాగాలే మూగబోయినందుకమ్మా


రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..
రాలేదు ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా 


చరణం 1 :


పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ
పిలిచినా రాగమే .. పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ
 


బహుశా అది తెలుసో ఏమో
బహుశా అది తెలుసో ఏమో జాణ కోయిలా ..
రాలేదు ఈ తోటకీ ఈ వేళా


రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..
రాలేదు ఈ వేళా అందుకేనా .. అందుకేనా



చరణం 2 :


గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ
గుండెలో బాధలే .. గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటిపాప జాలికి లాలీ పాడినప్పుడూ


బహుశా తను ఎందుకనేమో .. ల ల లా ల ల ల ల ల లా లా
బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా ..
రాలేదు ఈ తోటకీ ఈ వేళా.. 


రాగాలా పల్లకిలో కోయిలమ్మా ..
రానేలా నీవుంటే కూనలమ్మా




No comments:

Post a Comment