Sunday, March 27, 2016

నువ్వు కాటుక దిద్దకపోతే





చిత్రం :  మొగుడు-పెళ్ళాలు (1985)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి 





పల్లవి : 


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు




చరణం 1 :




నువ్వు తెల్ల చీర కట్టుకుంటే వెన్నెలాయె నా దారి
వెన్ను మీద కన్ను మూస్తే వెల్లువాయె గోదారి


పూల గుడికి చేరుకుంది చిలిపి తేటి పూజారి
తేనె వెన్నెలభిషేకాలే చేసుకుంది ఈ రేయి


నువ్వు ముగ్గులు పెట్టకపోతే నా ఇంటికి వేకువ రాదు
నీ పాదమే తాకకపోతే ఆ ముగ్గుకు మురిపెం లేదు


నా కన్నుల ఆశలతో నీ ముద్దులు కోరకపోతే
రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు
రాత్రికి జాబిలి రాదు రేయి తెల్లవారదు 


నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు



చరణం 2 :



చిలిపి నవ్వులూదగానే సిగ్గు పూల చైత్రాలు
వలపు చూపు చూడగానే చీకటింటి కావ్యాలు


వెచ్చనైన ఊపిరంతా వేణువైన లాహిరిలు
మోహనాన ఊహలెన్నో మోవి దాచు అల్లర్లో


ఎద హారతి పట్టకపోతే నా దేవుడు నిదరే పోడు
విరిశయ్యను పరవకపోతే పరువానికి పరువే లేదు


నా పచ్చని గడపలలో నీ పాదాలు కడగకపోతే
ప్రేమకు పొద్దే పోదు బ్రతుకే అర్ధం కాదు
ప్రేమకు పొద్దే పోదు బ్రతుకే అర్ధం కాదు




నువ్వు కాటుక దిద్దకపోతే మలి సంధ్యకు చీకటి రాదు
నీ కౌగిట చేరకపోతే ఆ చీకటి వెన్నెల కాదు


నా దోసిట మల్లెలతో నీ వాకిట నిలవకపోతే
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు
వయసుకి వేసవి రాదు వలపుల చలి పోదు




No comments:

Post a Comment